ఆడబిడ్డను ఆశీర్వదించండి
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:04 AM
మీ ఆడబిడ్డను ఆశీర్వదించండి.. తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించాల ని ఆ పార్టీ అధినేత కవిత అన్నారు.
- ప్రజల బతుకులు మారాలంటే టీఆర్‌ఎస్‌ను ఆదరించాలి
- రాష్ట్రంలో విద్య, వైద్యం, సామాజిక న్యాయం కరువైంది
- కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో పార్టీ అధినేత కవిత
కోస్గి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మీ ఆడబిడ్డను ఆశీర్వదించండి.. తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించాల ని ఆ పార్టీ అధినేత కవిత అన్నారు. నారాయణపేట జిల్లా, కొడంగల్ ని యోజకవర్గంలోని కోస్గి పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె మాట్లాడా రు. ప్రస్తుతం రాష్ట్రంలో దోపిడీ, అరాచకం జరుగుతోందన్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయనుకుంటే, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దోపిడీకి గురయ్యామన్నారు. ప్రస్తుత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అరా చకం నడుస్తోందన్నారు. రానున్న రోజుల్లో కోస్గి, కొడంగల్ ప్రజల ఆశీర్వా దం, తెలంగాణ ప్రజల అండతో నేను కూడా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తానన్న విశ్వాసంతో ఉన్నానని చెప్పారు. మన యువతకు ఉద్యోగాలు రాకపోతే ఆంద్రోళ్లు కారణంగానే రాలేదని భావించాం కానీ తెలంగాణ వచ్చిన తరు వాత కూడా యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అందుకే ఈ తం గెడుపువ్వు రంగు జెండాతో మీ ముందుకు వచ్చి ఆశీర్వాదం కోరుతున్నానన్నారు. మీరు గెలిపిస్తే రాష్ట్రంలో ప్రతీ బిడ్డ ను చదివించే బాధ్యతను తీసుకుం టానన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడ చూసినా ఇసుక దందా, మట్టి దందా, ఇందిరమ్మ ఇళ్లకోసం డబ్బుల వసూలు, దందాలు చేస్తు న్నారని మండిపడ్డారు. ముఖ్యమం త్రి సొంత నియోజకవర్గం కొడంగ ల్‌లో కూడా దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి 10 శాతం కమీషన్లు పెం చుతోందని, మొదటి సంవత్సరం 10, రెండవ సంవత్సరం 20, మూ డో సంవత్సరం 30 శాతం కమీషన్లతో దోచుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై కళాకారుల ఆటా పాటా అందరినీ అలరించాయి. అంతకు ముందు కొడంగల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళి అర్పించారు.