Share News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అరెస్టు

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:55 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అరెస్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అరెస్టు చేసి, తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకుంటున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు

- జూరాలకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

- పోలీసు వాహనానికి అడ్డుపడిన కార్యకర్తలు

- 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో

జడ్చర్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచం దర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జూరాల ప్రాజెక్ట్‌ వద్ద ఆందోళన చేపట్టిన రైతులను కలిసేందుకు వెళ్తున్న ఆయనను మహబూ బ్‌నగర్‌ జిల్లా, జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలోని ఓ హోటల్‌ వద్ద అడ్డుకున్నారు. ఆయనతో పాటు, బీజేపీ, కిసాన్‌మోర్చా నాయకులను అరెస్టు చేసి, జడ్చర్ల సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా బీజేపీ శ్రేణులు అడ్డుకు న్నారు. అరెస్టుకు నిరసనగా 44వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో రాంచందర్‌రావును జడ్చర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు నానా పాట్లు పడ్డారు. పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తే.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపడ్తారన్న అను మానంతో జాతీయరహదారి మీదుగా కాకుండా గొల్లపల్లి నుంచి కోడ్గల్‌ వరకు వెళ్లారు. ఆ తర్వాత ఆయనను జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తర లించేందుకు వెళ్లిన దారిలోనే తిరిగి వచ్చి పోలేపల్లి వరకు వచ్చి, మాచారం మీదుగా తరలించారు. దీంతో రాంచందర్‌రావును ఎక్కడికి తరలిస్తున్నారో పార్టీ నాయకులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి చేరుకున్న తర్వాత అరెస్టు అయిన వారి వివరాలను నమోదు చేసుకుని, సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. అరెస్టు అయిన వారిలో బీజేపీ నాయకులు శాంతకుమార్‌, మాజీ ఎమ్మెల్యే గువ్వలబాలరాజు, శ్రీవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, బాలాత్రిపురసుందరి, సాహితీరెడ్డి, నాగరాజు, అమర్‌నాథ్‌గౌడ్‌, దిలీప్‌కుమార్‌, నవీన్‌ ఉన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:55 PM