ఓట్లు చోరీ చేసేందుకు సిద్ధమైన బీజేపీ
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:29 PM
ఓట్లు చోరీ చేసేందుకు బీజేపీ సిద్ధమైందని, క్షేత్రస్థాయిలో నిజమైన ఓట్లను కాపాడేబాధ్యత బీ ఎల్‌ఏలదే అని పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐ ఆర్ ఇన్‌చార్జి సిద్దేశ్వర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి సిద్దేశ్వర్
గద్వాలన్యూటౌన్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఓట్లు చోరీ చేసేందుకు బీజేపీ సిద్ధమైందని, క్షేత్రస్థాయిలో నిజమైన ఓట్లను కాపాడేబాధ్యత బీ ఎల్‌ఏలదే అని పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐ ఆర్ ఇన్‌చార్జి సిద్దేశ్వర్ అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల నియోజకవర్గం ఎస్‌ఐఆర్-11 బీఎల్ ఏలకు శిక్షణ తరగతుల సమావేశానికి, నూతన ఓటరు నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధ్యక్షతన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల అధికారులతో కలిసి కుట్రలు చేస్తున్నదని అన్నారు. ఎస్‌ఐఆర్ నెలరోజుల ప్రక్రియను గ్రామాల్లో పూర్తిస్థాయి లో పూర్తయ్యిందని, దాదాపుగా 84.48శాతం వర కు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందుకే ఈ సమావేశంలో ఫామ్ 6, 7, 8 ప్రక్రియను ఏ వి ధంగా అమలుచేయాలనే విషయాలపై అవగా హన కల్పించడం జరుగుతుందన్నారు. నెలరోజు ల ప్రక్రియలో గ్రామీణం, పట్టణంలోని బీఎల్ ఏలు క్షేత్రస్థాయిలో వెళ్లి ఎక్కడ ఓట్లు తొలగించారు, వాటికి సంబంధించిన ఆ ఓటర్ల నమోదు ప్రక్రియను చేయాలన్నారు. అలాగే ప్రజల్లో అవ గాహన కల్పించాలన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నూతన ఓటరు న మోదు ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మునిసిప ల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి, ఉమ్మడి జిల్లా అసెంబ్లీ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి శ్రీనివాసగౌడ్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.