Share News

ఆదివాసీల మహనీయుడు బిర్సా ముండా

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:44 PM

ఆదివాసీల హ క్కుల, ఆత్మగౌరవం కోసం పోరా డిన మహనీయుడు బిర్సా ముండా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వే ముల నరేందర్‌రావు అన్నారు.

ఆదివాసీల మహనీయుడు బిర్సా ముండా
అమరగిరి చెంచు గూడెంలో బీర్సా ముండా చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల హ క్కుల, ఆత్మగౌరవం కోసం పోరా డిన మహనీయుడు బిర్సా ముండా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వే ముల నరేందర్‌రావు అన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలో బిర్సా ముండా జయంతిని ఘనంగా ని ర్వహించారు. పట్టణంలోని అంబే డ్కర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి జిల్లా అధ్యక్షుడు పూల మాలలు వేసి నివాళి అ ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరా డిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా అని కొనియాడారు. ఆయన జీవిత చ రిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, భావితరాలకు పో రాట స్ఫూర్తిని తెలియజేయాలని కోరారు. కార్య క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద ర్‌గౌడ్‌, రాజా రామేశ్వరరావు, జాకీర్‌ హుస్సేన్‌, ప్రమోద్‌, రాము, సుదర్శన్‌, సత్యనారాయణ, బా లమల్లయ్య, వెంకటయ్య, సుధాకర్‌, వెంకటేష్‌, సురేందర్‌శెట్టి, రామన్‌గౌడ్‌, రంజిత్‌, నవీన్‌, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

అమరగిరి చెంచుగూడెంలో..

కొల్లాపూర్‌: ఆదివాసీల హక్కులు, భూముల రక్షణ కోసం బ్రిటీష్‌ పాలకులపై తిరుగుబాటు చేసిన గొప్ప యోధుడు భగవాన్‌ బీర్సా ముండా అని మై భారత్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ రాజేం దర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని అ మరగిరి చెంచు గూడెంలో బీర్సా ముండా జ యంతి ఘనంగా నిర్వహించారు. అమరగిరి స ర్పంచ్‌ లింగమ్మ కార్యక్రమంలో భాగంగా చెం చుగూడెంలోని విద్యార్థులకు నోటుబుక్స్‌, పెన్ను లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మద్దిలేటి, శివ, భరత్‌ యాదవ్‌, గూడెం వాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:44 PM