Share News

పదేళ్లలో భూత్పూర్‌కు మొండి చెయ్యి

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:10 PM

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో భూత్పూర్‌ మునిసిపాలిటీకి మొండి చెయ్యి చూయించారని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

 పదేళ్లలో భూత్పూర్‌కు మొండి చెయ్యి
మాజీ మునిసిపల్‌ కౌన్సిలర్‌ బాల్‌కోటిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

- కాంగ్రెస్‌లో చేరిన మునిసిపల్‌ మాజీ కౌన్సిలర్‌

భూత్పూర్‌, మూసాపేట జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో భూత్పూర్‌ మునిసిపాలిటీకి మొండి చెయ్యి చూయించారని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మునిసిపాలిటీలోని రాందాస్‌చెరువు తండాకు చెందిన మాజీ మునిసిసపల్‌ కౌన్సిలర్‌ బాల్‌కోటి 150 మంది అనుచరులతో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే జీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం మునిసిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌, టీటీడీ దేవస్థాన మాజీ మెంబర్‌ జీవన్‌రెడ్డి ముఖ్యఅథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత భూత్పూర్‌ మునిసిపాలిటీలోని తండాలకు రూ.20 కోట్ల వ్యయంతో సీసీరోడ్డు, డ్రైనేజీలు నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్‌ను జిల్లా ముడా చైర్మన్‌ పదవిని కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కర్వెన రిజర్వాయర్‌ నిర్మాణం పేరుతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నల్లమట్టి, ఇసుకను అడ్డగోలుగా దోచుకున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. అదే విధంగా మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లిలో 24 గంటల విద్యుత్‌ సరఫరాకు భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు పద్మ, సర్పంచులు సంజీవరెడ్డి, తారునాయక్‌, నీలమ్మ, మాసగౌడ్‌, నాయకులు నరసింహారెడ్డి, వెంకటనారాణ, సంజీవరెడ్డి, సర్పంచు కమలమ్మ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామన్‌గౌడ్‌, సర్పంచులు రవిరాజాచారి, రాంచందర్‌, నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, బాలరాజు ఉన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:10 PM