ఘనంగా భోగి పండుగ
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:35 PM
సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు భోగిని బుధవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
జడ్చర్ల/దేవరకద్ర/హన్వాడ, జన వరి 14 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు భోగిని బుధవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ విశిష్టతతో పాటు సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు ముగ్గులు వేశారు. జడ్చర్ల మునిసిపాలిటీ అయోధ్యనగర్ కాలనీ లోని శ్రీ సింధూర గణపతి ఆలయం ప్రాంగణంలో కాలనీవాసులు భోగి మంటలు వేశారు. కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ కోడ్గల్ యాదయ్య, కాలనీవాసులు డాక్టర్ సునీల్, సతీష్, కిట్టు, కరుణాకర్ పాల్గొన్నారు. దేవరకద్ర, కౌకుంట్ల, హన్వాడ మండల కేంద్రా లతో ఆయా గ్రామాల్లో ప్రజలు భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
సంక్రాంతి.. కోళ్ల పందెం
మహబూబ్‌నగర్ రూరల్ : మండలంలోని తెలుగుగూడెం గ్రామంలో బుధవారం ఉదయం నుంచే గ్రామంలో సంక్రాంతి పండుగలో భాగం గా కోళ్ల పందెలు నిర్వహించారు. ఒక్క పోటీకి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పందెం లో పెట్టి పాల్గొన్నారు. ఓడిపోయిన వారు కోడి తో పాటు పందెంలో పెట్టిన డబ్బులు ఇచ్చేందు కు షరతు విధించినట్లు సమాచారం. పందెం కోడి రూ.5 వేల నుంచి రూ.20 వేలు పలికింది. ని కోరుతున్నారు.