Share News

బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణలో.. అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:22 PM

మునిసిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణలో అప్రమత్తంగా ఉం డాలని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిరబోయి అన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ కోసం ఎంపిక చేసిన జిల్లా కేంద్రంలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణలో.. అప్రమత్తంగా ఉండాలి
బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ప్రింటింగ్‌ ప్రెస్‌ను తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణలో అప్రమత్తంగా ఉం డాలని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిరబోయి అన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ కోసం ఎంపిక చేసిన జిల్లా కేంద్రంలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక కా ర్పొరేషన్‌, మునిసిపాలిటీల్లో 428 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించినట్లు చెప్పారు. ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్యం బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ సమయంలో పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ రామనుజులరెడ్డి, బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌ నోడల్‌ అధికారి, డీఆర్‌డీఓ నర్సింహులు, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి, ఉద్యావన శాఖ డీడీ వేణుగోపాల్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:22 PM