బతుకమ్మ బుతకమ్మ ఊయ్యాలో
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:37 PM
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా శనివారం జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కాలేజీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం (ఆంఽధ్రజ్యోతి) : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా శనివారం జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కాలేజీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకుల ఆట పాటలతో మార్మోగింది. తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేయగా, కళాశాల చైర్‌పర్సన్ చంద్రకళావెంకయ్య మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రకృతి మానవ సంబంధాన్ని మహిళల ఐఖ్యతను చాటి చెప్పే బతకమ్మ పండుగ అన్నారు.
జడ్చర్ల : పట్టణంలోని శ్రీవాసవీకన్యకపరమేశ్వరీ ఆలయం, సత్యనారాయణ స్వామి ఆలయం, సాయినగర్ కాలనీలోని సకలదేవతల ఆలయం, శ్రీసంతోషిమాత ఆలయం, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు పట్టణంలోని పలు కాలనీలలో మహిళలు బతుకమ్మను తయారు చేసి, ఆడిపాడారు.
భూత్పూర్ : మండలంలోని వివిధ గ్రామాల్లో గల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. మునిసిపాలిటీలోని దయానంద విద్యామందిర్, సాహితి హైస్కూల్లో విద్యార్థులు పాఠశాల ఆవరణలో బతుకమ్మను చేసి ఆడిపాడారు. కరెస్పాండెంట్లు సత్యనారాయణ, సురేందర్ పాల్గొన్నారు.