Share News

రాష్ట్ర పండుగగా బావోజీ జాతర

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:28 PM

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని బంజారాల ఆరాధ్య దైవం, దేశంలోనే అతిపెద్ద జాతర గురులోక మాసంత్‌ బావోజీ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.

రాష్ట్ర పండుగగా బావోజీ జాతర
తిమ్మారెడ్డిపల్లిలో ఆలయ కమిటీ సభ్యులకు జీఓ పత్రం అందిస్తున్న కొడంగల్‌ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌, ఆర్డీఓ

గుర్తిస్తూ జీఓ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

కొత్తపల్లి, ఏప్రిల్‌, 1 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని బంజారాల ఆరాధ్య దైవం, దేశంలోనే అతిపెద్ద జాతర గురులోక మాసంత్‌ బావోజీ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నంబరు 32ను మంగళవారం జారీ చేసింది. జీఓ పత్రాన్ని కొడంగల్‌ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, కొత్తపల్లి తహసీల్దార్‌ జాయరాములు, ఆర్డీఓ రాంచందర్‌ ఆలయ కమిటీ సభ్యులకు దేవాలయ ప్రాంగణంలో అందించారు. గు రులోక మాసంత్‌ మహరాజ్‌(బావోజీ) 17వ శతాబ్దంలో ఈ పుణ్యక్షేత్రంలో జీవ సమాధి అయ్యారని ఆలయ క మిటీ సభ్యులు తెలిపారు. అప్పటి నుం చి ఈ జాతరకు మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుం చి బంజారాలు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారన్నారు. ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాపట్టానికి క్షీరాభిషేకం చేశారు. సీఎంకు, కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, కాడా ప్రత్యేక అధికారి వెంటకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల నాయకులు రమే్‌షరెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 11:28 PM