వాట్సాప్‌లో బ్యాలెట్ పేపర్
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:38 PM
నారాయణపేట జిల్లా, మక్తల్ ము న్సిపాలిటీ లోని 12వ వార్డుకు సంబంఽ దించిన బ్యాలెట్ పేపర్ గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొ ట్టింది.
మక్తల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేట జిల్లా, మక్తల్ ము న్సిపాలిటీ లోని 12వ వార్డుకు సంబంఽ దించిన బ్యాలెట్ పేపర్ గురువారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొ ట్టింది. 1920 నెంబరు కలిగిన బ్యాలె ట్ పేపర్‌ను ఫొటో తీసి ‘ఓట్ ఫర్ కాంగ్రెస్‘ అని రాసి పార్టీకి ఓటు వేసి నట్లుగా పేర్కొంటూ వాట్సాప్‌లో పో స్టు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫో న్‌కు అనుమతి లేదు. ఓటు వేసేందు కు వెళ్లిన వ్యక్తులు సెల్‌ఫోన్ తీసుకెళ్ల రాదన్న నిబంధన ఉంది. అందుకు అ ధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీ సుకున్నా ఓటరు సెల్‌ఫోన్‌నుపోలింగ్ బూత్ లోపలికి లోపలికి తీసుకువెళ్లి బ్యాలెట్ పేపర్‌ను ఫొటో తీసి పోస్టు చేయడం చర్చనీయంశంగా మారింది. ఈ సంఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.