రోడ్డు నిబంధనలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:23 PM
రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు ఎస్పీ శంకర్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు
గద్వాలక్రైం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు ఎస్పీ శంకర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10రోజుల పాటు రోడ్డు భద్రతా ప్రత్యే క అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందు లో భాగంగా జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆటోడ్రైవర్లు, ఇతర వా హనాల డ్రైవర్లకు, వాహనదారులకు ఎస్పీ శ్రీని వాసరావు ఆదేశాల మేరకు భద్రతా వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్డ్ ప్రాధాన్యత, ఫస్ట్ ఎయిడ్ వినియోగం, డిఫెన్సివ్ డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. రోడ్డు, ట్రాఫిక్ నిబంధ నలు తప్పకుండా పాటించినప్పుడే ప్రమాదాలు జరగవని అన్నారు. డీఎస్పీ మొగులయ్య మాట్లాడుతూ రోడ్డుప్రమాదాల నివారణకు ప్రతీ వాహనదారుడు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, అలంపూర్ సీఐ రవిబాబు, గద్వాల పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ ఉన్నారు.