బాలల హక్కులు, చట్టాలపై అవగాహన అవసరం
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:46 PM
సమా జంలో ఎదురయ్యే మంచి, చెడులను తెలుసుకో వడంతోపాటు బాలలకు ఉద్దేశించిన హక్కులు, సంరక్షణ చట్టాలపై ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా డీఎల్‌ఏస్ లీగల్ ఎయిడ్ డిఫె న్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లు అన్నారు.
న్యాయవాదులు శ్రీనివాస్, లక్ష్మణ్
ధరూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): సమా జంలో ఎదురయ్యే మంచి, చెడులను తెలుసుకో వడంతోపాటు బాలలకు ఉద్దేశించిన హక్కులు, సంరక్షణ చట్టాలపై ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా డీఎల్‌ఏస్ లీగల్ ఎయిడ్ డిఫె న్స్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు శ్రీనివాస్, లక్ష్మణ్‌లు అన్నారు. జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా న్యాయసేవా సంస్థ స హకారంతో బుధవారం అల్లపాడులోని ప్రభుత్వ పాఠశాల, ధరూర్ కేజీబీవీ విద్యార్థులకు బాలల హక్కులు-బాలల చట్టాలపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా న్యా యవాదులు మాట్లాడుతూ బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, లైంగిక వేధింపులు వంటి సమస్యల నుంచి పిల్లలను రక్షించేందుకు అమ లులో ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడ కుం డా సంబంధిత అధికారులకు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ద్వారా సమాచారం అందించాలని సూ చించారు. అనంతరం జిల్లా న్యాయసేవా సంస్థ (డీఎల్‌ఎస్) ప్రతినిధులు బాలల చట్టాలపై న్యాయపరమైన అంశాలను వివరించి, విద్యా ర్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీపీఎస్ ఔట్ రీచ్ ప్రతితినిధి ప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ ఆది నారాయణ, మహేశ్, ప్రధానోపాధ్యాయురాలు లీలావతి, కేజీబీవో ఎస్‌వో గోమతి, చైల్ట్ హెల్ప్ లైన్ సూపర్‌వైజర్ దస్తగిరి, భరోసా సెంటర్ ప్ర తినిధి కవిత, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యా ర్థులు ఉన్నారు.