Share News

మక్తల్‌ కోర్టుకు న్యాయాధికారిగా అవినాష్‌

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:10 PM

మక్తల్‌ కోర్టుకు న్యాయా ధికారిగా అవినాష్‌ను పూర్తిస్థాయిలో కేటా యిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో మక్త ల్‌ న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు.

మక్తల్‌ కోర్టుకు న్యాయాధికారిగా అవినాష్‌
నారాయణపేట బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌ను సన్మానిస్తున్న మక్తల్‌ అడ్‌హక్‌ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్‌ తిమ్మన్న

- రెగ్యులర్‌ న్యాయాధికారి రాకతో న్యాయవాదుల సంబురాలు

మక్తల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మక్తల్‌ కోర్టుకు న్యాయా ధికారిగా అవినాష్‌ను పూర్తిస్థాయిలో కేటా యిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో మక్త ల్‌ న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా మిఠాయిలు పం చి సంబురాలు చేసు కున్నారు. జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి అవి నాష్‌, డిస్ట్రిక్ట్‌ ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్‌ న్యాయాధికారి బోయ శ్రీనివాసులు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి సాయిమనోజ్‌ తదితరులు పేట జిల్లా న్యాయవాదులను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రెగ్యులర్‌ న్యాయాధికారి రాకతో కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నారాయణపేట బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌ను మక్తల్‌ అడ్‌హక్‌ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్‌ తిమ్మన్న సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు చెన్నారెడ్డి, నర్సిములు, రాజశేఖర్‌, రవికుమార్‌గౌడ్‌, భరత్‌కుమార్‌, మహేష్‌, మోహన్‌, పొర్ల ఆనంద్‌, శివకుమార్‌, దేవసుగూర్‌ సునీత, సతీషకుమారి, ప్రవీణ్‌ తదితరులున్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:10 PM