Share News

ఆటో బోల్తాపడి... యువకుడి మృతి

ABN , Publish Date - May 15 , 2026 | 11:35 PM

ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన గద్వాల జిల్లా సంగాల వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది.

ఆటో బోల్తాపడి... యువకుడి మృతి

వడ్డేపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన గద్వాల జిల్లా సంగాల వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. కాలనీవాసులు తె లిపిన వివరాల ప్రకారం... మునిసిపాలి టీ పరిధిలోని రామచంద్రానగర్‌ కాలనీ వాసులు నిశ్చితార్థానికి గద్వాల సమీపం లోని సంగాలకు ఆటోలో గురువారం రాత్రి బయలుదేరి వెళ్లారు. కాగా, మార్గమధ్యలో మలుపు వద్ద ఆటో బో ల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజు కుమారుడు విజయ్‌(19) గాయపడ్డా డు. యువకుడి మెదడులో రక్తం గడ్డకట్టి దవాఖానాలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. మృతుడు ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

Updated Date - May 15 , 2026 | 11:35 PM