Share News

ఆటో బోల్తా, బాలుడి మృతి

ABN , Publish Date - May 07 , 2026 | 11:23 PM

ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఓ బాలుడు మృతి చెందగా, మరొకరికి గా యాలైన సంఘటన గురువా రం చోటు చేసుకుంది.

 ఆటో బోల్తా, బాలుడి మృతి

- మరొకరికి గాయాలు

బల్మూరు, మే 7 (ఆంధ్రజ్యోతి) : ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఓ బాలుడు మృతి చెందగా, మరొకరికి గా యాలైన సంఘటన గురువా రం చోటు చేసుకుంది. నాగర్‌క ర్నూల్‌ జిల్లా బల్మూరుకు చెం దిన గడిల కార్తీక్‌(13) మృతి చెందగా, అదే ఆటోలోనే మరొ కరు మద్దెల ధనుష్‌ గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యు లు, పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. బల్మూరు గ్రామానికి చెందిన గౌస్మియాకు సంబంధించిన టెం ట్లు సామాన్లు వేసుకుని ఇద్దరు వ్యక్తులు లింగాల మండలం జిలుగుపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ సామగ్రి వేసి తిరిగి వస్తున్నారు. అనంతవరం-నర్సాయిపల్లి గ్రామాల స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన ఆటో అదుపు తప్పి చెట్టును ఢీకొని బండరాయిని తగలడంతో కార్తీక్‌ అక్కడికక్కడే మృతి చెందా డు. ఆటో నడుపుతున్న ధనుష్‌కు తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలి పారు. సంఘటన జరిగిన సమీపంలో వస్తున్న వాహనదారుడు గుర్తించి వెంటనే సమాచారమందించి గాయపడిన ధనుష్‌ను 108 ద్వారా అచ్చం పేటకు తరలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తల్లి పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు, పో స్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డుపై నిలిపిన డీసీఎంను ఢీకొని..

గోపాల్‌పేట, (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై డీసీ ఎం డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ యువకుడు మృతి చెందాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన ఉందెకోటి మనోహర్‌ (34) బుధవారం గోపా ల్‌పేటలో తమ బంధువుల పెళ్లికి వచ్చాడు. శుభకార్యం ముగించుకొని రాత్రి స్వగామానికి బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మండల కేంద్ర పరిధిలో గాజుల కోనేరు పక్కన ప్రధాన రహదారిపై డీసీఎం డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నిలిపి వెళ్లాడు. అది గమనించని మనోహర్‌ డీసీఎం వెనుకాల బలంగా ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయం కాగా, గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచా రం అందించారు. మనోహర్‌ను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు సూచన మేరకు మహబూబ్‌ నగర్‌కు తరలించారు. పరిశీ లించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి మృతి చెందిన మనోహర్‌ కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం తాడిపర్తి గ్రామం నుంచి పెద్దఎత్తున యువకులు. కుటుంబ సభ్యులు, బంధువులు మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌ ఆవరణంలో డీసీఎం యజమాని, మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతుండగా మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసుకొని మనోహర్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లో పోలీస్‌ స్టేషన్‌ ఆవర ణలో ఉంచారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. బాధిత కు టుంబానికి రూ.4 లక్షలు ఇస్తామని పెద్దమనుషులు తీర్మానం చేసినట్లు తెలిసింది.

Updated Date - May 07 , 2026 | 11:23 PM