Share News

ప్రజా వ్యతిరేక విధానాలపై ఆటో జాతా

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:23 PM

మహాత్మా గాంధీజీ ఉపాఽఽధి హామీ పఽఽథకానికి ఉన్న గాంధీ పేరును మార్చడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి పేర్కొన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై ఆటో జాతా
ఆటోజాతా నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు

మహమ్మదాబాద్‌ జనవరి 18 (ఆంరఽధజ్యోతి) : మహాత్మా గాంధీజీ ఉపాఽఽధి హామీ పఽఽథకానికి ఉన్న గాంధీ పేరును మార్చడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆటో జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా కర పత్రాలు పంచుతూ కేంద్రం చేపడుతున్న కార్మిక రైతు కూలి వ్వతిరేఖ విఽఽధానాలు, ప్రజా వ్యతిరేఖ, విద్యుత్‌ చట్టం, రైతు వ్యతిరేక, విత్తన సవరణ బిల్లు, లేబర్‌ కోడ్లను ఉపసంహరించుకునే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడియాల మోహన్‌, తిరమలగిరి మాజీ సర్పంచ్‌ బాలకిష్టయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, పాండు, దత్తు, తిరుపతయ్య, రాములు, చంద్రయ్య, వెంకటయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.

ఐదు బిల్లులు ఉపసంహరించుకోవాలి

హన్వాడ : కేంద్రం అమలు చేస్తున్న ఐదు ప్రజా వ్యతిరేఖ బిల్లులను ఈ శీతకాల సమావేశాల్లో ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం హన్వాడలో ఆటో జాతా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మోహన్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం, విద్యుత్‌ సవరణ, విత్తన కార్మిక సవరణ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాల నాయకులు తిరుమలయ్య, రాములు, పాండు, దత్తు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 11:23 PM