Share News

బలవంతపు గర్భస్రావానికి యత్నం

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:40 PM

ప్రేమ వివాహం చేసు కున్న ఓ మహిళకు బలవంతంగా గర్భస్రావం చేసేందుకు జరిగిన య త్నంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పం దించింది.

బలవంతపు గర్భస్రావానికి యత్నం

- మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం

- గర్భిణికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం

నాగర్‌కర్నూల్‌ క్రైం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రేమ వివాహం చేసు కున్న ఓ మహిళకు బలవంతంగా గర్భస్రావం చేసేందుకు జరిగిన య త్నంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పం దించింది. బాధితురాలికి తక్షణ రక్షణ కల్పించాలని, బాధ్యులపై చట్టపరమై న చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని గురువారం ఆదే శించింది. మహేశ్‌ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ స్పందించారు. ఫిర్యాదులో పేర్కొ న్న వివరాల ప్రకారం... మహేష్‌, భాగ్య గత నెల 30న యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఇష్టం లేని భాగ్య తండ్రి, బావ కలిసి ఇటీవల ఆమెను కల్వకుర్తి సమీపంలోని ఓ ఆసుపత్రికి తర లించారు. అప్పటికే నాలుగు నెలల గర్భవతి అయిన ఆమెకు బలవంతంగా గర్భస్రావం చేయించేందుకు యత్నించారు. ఈ తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంత జరిగినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ న మోదు చేయకపోవడంపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా స్వే చ్ఛ, స్వచ్భంద సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టరీత్య నేరమని స్పష్టం చేసింది. కల్వకుర్తి సబ్‌ డివిజనల్‌ పోలీసు ఆఫీసర్‌, వంగూరు పోలీ సు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలు తక్షణమే స్పందించి గర్భిణికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ స్వయంగా పర్యవేక్షిం చి, ఘటనపై తీసుకున్న చర్యలపై ఈ నెల 26 లోగా సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది.

Updated Date - Feb 12 , 2026 | 11:40 PM