Share News

క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:04 PM

క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కబడ్డీ సంఘం జిల్లా అఽఽధ్యక్షుడు శాంతికుమార్‌ పేర్కొన్నారు.

 క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి

- కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కబడ్డీ సంఘం జిల్లా అఽఽధ్యక్షుడు శాంతికుమార్‌ పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్‌ జానియర్‌ కబడ్డీ టోర్నీలో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలుర జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జట్టు క్రీడాకారులను అభినందించి, ట్రాక్‌సూట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు తన వంతు సహకారం ఉంటుందన్నారు. రాబోయే ఖేలో ఇండియా పోటీల్లో తెలంగాణ జట్టు చక్కటి ప్రతిభ చాటాలన్నారు. కబడ్డీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌, ముత్యం, రామచంద్రయ్య, శ్రీహరి, బాలరాజు, తిరుపతయ్య, పురుషోత్తం, దామోదర్‌రెడ్డి, పాపరాయుడు, గణేష్‌నాయుడు, శ్రీనివాసులు, చంద్రశేర్‌, అమినుద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2026 | 11:04 PM