Share News

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:21 PM

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి పోటీ ల్లో రాణించాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు అన్నారు.

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి
పోటీలను ప్రారంభిస్తున్న రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు బాలరాజ్‌ గౌడ్‌, ప్రభాకర్‌

- ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు

గద్వాల అర్బన్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి పోటీ ల్లో రాణించాలని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి తోట శ్రీనివాసులు అన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు అథ్లె టిక్స్‌ పోటీలను రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్లు బాలరాజ్‌ గౌడ్‌, ప్రభాకర్‌ ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అథ్లెటిక్స్‌ క్రీడకు జోగుళాంబ గ ద్వాల జిల్లా పుట్టినిల్లులాంటిదని కొనియాడారు. ఇక్కడి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి దివంగత సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌, అథ్లెటిక్స్‌ క్రీడాకారుడైన ఉస్మాన్‌ సాధించిన రికార్డులు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరూ సాధించలేదని వారు ఈ సందర్భంగా గుర్తుకు చేశారు. ప్రతీ ఒక్క అథ్లెటిక్‌ క్రీడాకారుడు ఉస్మాన్‌ను స్ఫూ ర్తిగా తీసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యా తులు తీసుకురావాలన్నారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బీసన్న, సతీష్‌కుమార్‌లు మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ మం డలాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. అండర్‌-10, 12 వి భాగాల్లో 60, 200, 400 మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్‌ జంప్‌, అం డర్‌-14, 16 విభాగాల్లో ఏ, బీ, సీ గ్రూపులు, అండర్‌-16 విభాగంలో 60, 600 మీ టర్ల లాంగ్‌జంప్‌ పరుగు పందెం, హైజంప్‌, జావెలిన్‌త్రో, షాట్‌ఫుట్‌ త్రో పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో ప్రతిభ కనబరచిన 40 మంది క్రీడాకారులను కొ మరంభీం జిల్లా ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరు గుతుందన్నారు. అలాగే అండర్‌-14, 16 విభాగాల్లో ప్రతిభ చూపిన 12 మంది క్రీడాకారులు అంతర్‌ జిల్లా జాతీయ స్థాయి క్రీడలకు నవంబర్‌ 14 నుంచి 16 వరకు సదాశివపేటలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం గెలు పొందిన క్రీడాకారులకు మెడల్స్‌, సర్టిఫికెట్లను అందజేశారు.

Updated Date - Oct 04 , 2026 | 11:22 PM