క్రీడాకారులను ప్రోత్సహించాలి
ABN , Publish Date - May 03 , 2026 | 11:41 PM
గ్రామీణ ప్రాం తాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆది వారం మండలంలోని ఇబ్రహ్నింపట్నం గ్రామం లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.
- డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి
మరికల్, మే 3 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాం తాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆది వారం మండలంలోని ఇబ్రహ్నింపట్నం గ్రామం లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈసం దర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడలతో పాటు చదు వుపై కూడా సమానంగా ఆసక్తి చూపాలన్నారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉం టుందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల వైపు అడుగులు వేయా లన్నారు. కార్యక్రమంలో గొల్ల కృష్ణయ్య, సర్పంచ్ రఘు, ఉపసర్పంచ్ మునిస్వామి, మాధ్వార్ సర్పంచ్ మొగ్గులయ్య, రవి, సతీష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.