Share News

దక్షిణ భారత సోషలిస్టు సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:37 PM

కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులో జరిగిన దక్షిణ భారత సోషలిస్టు కూటమి సమావేశంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.

దక్షిణ భారత సోషలిస్టు సమావేశంలో   అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులో జరిగిన దక్షిణ భారత సోషలిస్టు కూటమి సమావేశంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. సెంటర్‌ ఫర్‌ సోషలిస్టు స్టడీస్‌ ఆహ్వానం మేరకు ఆయన సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ఉనికి క్షీణించే ప్రమాదం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడుల్లో కొద్దిపాటి సీట్లు పెరుగుతాయన్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాలతో పొల్చి చూస్తే పెరిగే సీట్ల సంఖ్య చాలా స్వల్పంగా ఉందని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:37 PM