బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు వేలం
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:53 PM
ప్రభుత్వ బకాయిలను అక్టోబరు 31లోగా చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవ రీ(ఆర్‌ఆర్)చట్టం ప్రకారం చర్యలు తప్పవని ఎన్‌ఫోర్సుమెంట్ టాస్క్ ఫోర్సు ఎస్పీ రామ్‌కుమార్ స్పష్టం చేశారు.
- అక్టోబరు 31లోగా రూ.412కోట్లు చెల్లించాలి
-డిఫాల్ట్ మిల్లర్లపై ఆర్‌ఆర్ చట్టం కింద చర్యలు
-ఎన్‌ఫోర్సుమెంట్ టాస్క్‌ఫోర్సు ఎస్పీ రామ్‌కుమార్
వనపర్తి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బకాయిలను అక్టోబరు 31లోగా చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవ రీ(ఆర్‌ఆర్)చట్టం ప్రకారం చర్యలు తప్పవని ఎన్‌ఫోర్సుమెంట్ టాస్క్ ఫోర్సు ఎస్పీ రామ్‌కుమార్ స్పష్టం చేశారు. గురు వారం వనపర్తి కలెక్ట రేట్‌లో అధికారుల తో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. డిఫాల్ట్ రైస్‌మిల్లర్లు గడువు లోగా బకాయిలు చెల్లించకపోతే వారి ఆ స్తులను వేలం వేసి ప్రభుత్వ బకాయిలను రికవరీ చేస్తామని హెచ్చ రించారు. యాసంగి సీజన్ 2022-23కు సంబంధించి వేలం ద్వారా కేటాయించిన ధాన్యానికి మొత్తం రూ.474కోట్ల బకాయిలు ఉన్నట్లు తె లిపారు. ఇప్పటి వరకు రూ.62.50కోట్లు మాత్రమే వసూలు కాగా ఇం కా రూ.412కోట్ల వరకు బకాయి ఉందన్నారు. వేలం ద్వారా కేటాయిం చిన ధాన్యం బకాయిలతోపాటు జీవోఎంఎస్ 7,9 ప్రకారం గుర్తించిన డిఫాల్ట్ పరిణామాలకు సంబంధించిన బకాయిలను కూడా మిల్లర్లు అక్టోబరు 31 వరకు చెల్లించాలని సూచించారు. ఆ లోగా మొత్తం బ కాయిలను చెల్లించని మిల్లర్లపై ఆర్‌ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్, అదనపు కలెక్టర్ వినోద్, జిల్లా పౌరసరఫరాల అఽధికారి ఆంజనేయులు మేనేజర్ హరీశ్, మిల్లర్లు పాల్గొన్నారు.