న్యాయం కోసం వెళితే.. పోలీసుల దాడి
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:34 PM
న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తనపై ఎస్‌ఐ దాడి చేశాడని జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వీరేశ్ ఆరోపిం చారు.
- పురుగులు మందు తాగిన బాధితుడు
ధరూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన తనపై ఎస్‌ఐ దాడి చేశాడని జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వీరేశ్ ఆరోపిం చారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వీరేశ్ సర్పంచు ఎన్నికల్లో గ్రామంలో పోటీచేసి ఓడిపోయాడు. కాగా, ఓ కేసు విషయమై ధరూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంగా ఎస్‌ఐ తనను అవమాన పరిచి దాడి చేశాడని తెలి పాడు. తనను అకారణంగా పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. మనస్తాపం చెంది శుక్రవారం పురుగు మందు తాగాడు. దీంతో అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తనపై దాడి చేసిన ధరూ ర్ ఎస్‌ఐతో పాటు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ విషయంపై ధరూర్ ఎస్‌ఐ నందీకర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. కొద్దిరోజుల క్రితం ద్విచక్ర వాహనాలు ఢీకొట్టిన కేసు విష యంలో జోక్యం చేసుకున్నారని బాధితులు ఇరువురు రాజీ పడ్డారని తె లిపారు. ఈ విషయంలో తాను బాధితుడిపై ఎలాంటి దాడి చేయ లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు.