Share News

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:34 PM

తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న గణనాథులను బుధవారం నిమజ్జనం చేయను న్నారు.

నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
స్వాగత వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ గిరీశ్‌

- నాగసాల చెరువు వద్ద భారీ క్రేన్‌ ఏర్పాటు

- నేతాజీ చౌరస్తా వద్ద స్వాగత వేదిక

జడ్చర్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న గణనాథులను బుధవారం నిమజ్జనం చేయను న్నారు. జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని నాగసాల చెరువులో నిమజ్జనం చేసేందుకు భారీ క్రేన్‌తో పాటు మరో క్రేనును అందుబాటులో ఉంచారు. విద్యుత్‌దీపాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తరిలే గణనాథులకు స్వాగతం పలికేందుకు పట్టణంలోని నేతాజీచౌరస్తా వద్ద స్వాగత మండపం ఏర్పాటు చేశారు. ఎలాంటి పొర పాట్లు లేకుండా నిమజ్జనం సాఫీగా జరిగేలా సిబ్బందిని కేటాయించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లు, స్వాగత మండపం ఏర్పాట్లను మునిసిపల్‌ కమి షనర్‌ గిరీష్‌ పరిశీలించారు. సాంప్రదాయ పద్ధతిలో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేద్దామని విశ్వహిందూ పరిషత్‌ నాయకులు ము చ్చర్ల శ్రీకాంత్‌, ప్రవీణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నిమజ్జన శోభాయాత్రను క్రమబద్దంగా నిర్వహించాలని, పరిమితితో కూడిన సౌండ్‌ బాక్స్‌లు, సౌండ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చే సుకోవాలన్నారు. పోలీసుల సూచనలు, పాటి స్తూ శోభాయాత్ర చేపట్టాలని కోరారు.

Updated Date - Sep 22 , 2026 | 11:34 PM