Share News

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:21 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 17న పాలమూరులో పర్యటించనున్నారు. రూ.12 వందల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు
సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- పరిశీలించిన కలెక్టర్‌ విజయేందిర బోయి

- చిట్టెబోయిన్‌పల్లిలో హెలిప్యాడ్‌

- ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో సభ

మహబూబ్‌నగర్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 17న పాలమూరులో పర్యటించనున్నారు. రూ.12 వందల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రాకకోసం జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లిలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విజయేందిర బోయి మంగళవారం చిట్టెబోయినపల్లిలో హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహణ, భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలపై అధికార యంత్రాంగంతో సమీక్షించారు. పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో నేరుగా చిట్టెబోయినపల్లికి చేరుకుంటారు. అక్కడ ట్రిపుల్‌ఐటీకి శంకుస్థాపన చేస్తారు. అక్కడినుంచి మహబూబ్‌నగర్‌ పట్టణానికి చేరుకొని, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎంవీఎస్‌ కళాశాల మైదానానికి చేరుకొని బహిరంగసభలో ప్రసంగిస్తారు. కార్యక్రమంలో అడిషినల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, మధుసూదన్‌నాయక్‌, అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఈవో ప్రవీణ్‌కుమార్‌, అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:21 PM