రూ.91.80 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:33 PM
మహబూబ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్న ఆదాయా న్ని అంచనా వేసి రూపొందించిన రూ. 91.80 కోట్ల బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది.
మహబూబ్‌నగర్ మేయర్ సీటింగ్‌పై బీఆర్‌ఎస్ వాకౌట్
గళం విప్పిన కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు
నిధులు అడ్డగోలుగా ఖర్చుచేసే సంప్రదాయం ఉండదు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రానున్న ఆదాయా న్ని అంచనా వేసి రూపొందించిన రూ. 91.80 కోట్ల బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించింది. ఆస్తి, కొళాయి, భవనిర్మాణ అనుమతులు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఫీజు, అడ్వర్‌టైజ్‌మెంట్ రూపంలో వచ్చే రెగ్యులర్ ఆదాయంతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్‌ల రూపంలో రూ.229.80 కోట్ల ఆ దాయం వస్తుందని అంచనా వేశారు. శనివారం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మమత అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. బడ్జెట్‌ను ఆమోదించిన సభ్యులకు మే యర్ ధన్యవాదాలు తెలిపారు.
ఆదాయం పెంచుకునే అంశాలు వివరించిన సభ్యులు
బీజేపీ సభ్యులు పాండురంగారెడ్డి మా ట్లాడుతూ జీతాలు, ని ర్వహణ ఖర్చులకే బడ్జెట్‌లో కేటాయించారని అభివృద్ధి పనులకు ని ధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ స భ్యులు రమాదేవి, పూజిత బెనహర్, రామస్వామి మాట్లాడుతూ చాలా ఇళ్ళకు నెంబర్లు లేదని, కొన్నింటికి మొదటి ఫ్లోర్ వరకే పన్నులు విధిస్తున్నారని, పెద్ద్ద వా ణిజ్య భవనాలు పన్నుల పరిధిలో లేవన్నారు. యాడ్స్ ప్ర కటనల రూపంలో తక్కువ ఆదాయం వస్తుందని చెప్పా రు. ఖాళీ ప్రదేశాలకు ప న్నులు వేయాలని సూచించారు. సభ్యులు ప్రవీణ్ మా ట్లాడుతూ పాల్సబ్‌గుట్ట వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి చాలా నీరు వృథాగా పోతుందన్నారు. బీజేపీ సభ్యుడు పిట్ల యాదయ్య మాట్లాడుతూ వానగుట్టపై నిర్మించుకున్న 300 ఇళ్ళకు నెంబర్లు కేటాయించకపోవడంతో పన్నులు కట్టే పరిస్థితి లేదన్నారు. మరో సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మౌలాలి గుట్ట దగ్గర నిర్మించిన డబ్బుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను అర్హులకు కేటాయించాలని కోరారు. దీనిపై డిప్యూటీ మేయర్ ఎం. సురేందర్‌రెడ్డి స్పందిస్తూ గతంలో చాలామందికి ఒక్కో ఇంటిపై 2-3 పట్టాలు ఇచ్చారని, దీనిపై విచారణ జరుగుతుందని, అతిత్వరలోనే మౌలిక వసతులు కల్పించి కేటాయిస్తామన్నారు. ఎంఐఎం సభ్యులు రశీద్ మాట్లాడుతూ తమకు ఎజెండా ఉర్దూలో కూడా ఇవ్వాలని కోరగా, బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా ఉర్దూలో ఇస్తే తాము సంస్కృతం, హిందీలో కూడా ఇవ్వాలని కోరతామని అన్నారు.
బీఆర్‌ఎస్ వాకౌట్
సభ ప్రారంభిస్తుండగానే బీఆర్‌ఎస్ కార్పొరేటర్ ఆర్. జ్యోతి మాట్లాడుతూ కార్పొరే షన్లలో నిర్వహించే కౌన్సిల్ సమావేశాలలో వేదికపై మేయర్‌కు మాత్రమే సీటు ఉంటుందని, ఇక్కడ మాత్రం 5 సీట్లు కేటాయించారని అభ్యంత రం వ్యక్తంచేశారు. దీనిపై కమిషనర్ రామాంజుల రెడ్డి స్పందిస్తూ అలా ఉండాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధానం పాలమూరులో ఎందుకని, బీసీ మేయర్‌ను అవమానించడమేని బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించగా, కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సభను తాము వాకౌట్ చేస్తామని బీఆర్‌ఎస్ సభ్యులు చెప్పగా, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి జోక్యం చేసుకొని నిబంధ నలకు విరుద్ధంగా ఏదీ చేయబోమని, నిబంధనలను కమిషనర్ వివరిస్తారని, ఆయన చెప్పిన తరువాత నిర్ణయం తీ సుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీకి ప్రత్యేక చట్టం ఉంటుందని, మునిసిపల్, కార్పొరేషన్‌లకు మరోచట్టం ఉంటుందని ఒకేసీటు వేయాలని చట్టం లేదని తెలుపగా, బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చే శారు.
నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు : ఎమ్మెల్యే శ్రీనివా్‌సరెడ్డి
గత పాలకుల మాదిరిగా పుర ఆదాయాన్ని ఈ కౌన్సిల్ దుర్వినియోగం చేయదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి స్పష్టం చేశారు. లీకేజీలను పూర్తిస్థాయిలో అరికట్టాలని, ప్రతిసభ్యుడు తమ డివిజన్‌లో రెగ్యూలర్‌గా పర్యటిస్తూ నీటి వృథాను అరికట్టాలని సూచించారు. ఎవరికైనా తమకు ఇదొక్కటే భాష వస్తుందని ఇందులోనే ఇవ్వాలని లిఖితపూర్వకంగా రాసిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారన్నారు. ప న్నులు వందశాతం చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ప్రభుత్వ విప్‌గా ఎ న్నికైన ఎమ్మెల్యేను, మేయర్, డిప్యూటీ మేయర్‌లను బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌లు సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి, అడిషినల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ పాల్గొన్నారు.