Share News

పీఏసీఎస్‌ల పాలకవర్గానికి నియామకపత్రాలు

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:17 PM

అలంపూర్‌ నియోజకవర్గంలోని ఏడు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘాలకు నూతన పాలక వర్గాల నియామక ప్రక్రియలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలోని కాంగ్రెస్‌ క్యాంపు కార్యాలయంలో అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ నియామక పత్రాలను అందించారు.

పీఏసీఎస్‌ల పాలకవర్గానికి నియామకపత్రాలు

  • అందజేసిన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌

ఎర్రవల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలోని ఏడు ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘాలకు నూతన పాలక వర్గాల నియామక ప్రక్రియలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలోని కాంగ్రెస్‌ క్యాంపు కార్యాలయంలో అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ నియామక పత్రాలను అందించారు. ఈసందర్భంగా సహకార సంఘాల అభివృద్ధికి, రైతులకు మెరుగైన సేవలు అందించేందు కు నూతనంగా నియమితులైన వారు కృషి చేయాలని సూచించారు. పుటాన్‌దొడ్డి సహకార సంఘానికి అధ్యక్షుడిగా మధునాయుడు, ఉపా ధ్యక్షుడిగా వేముల శ్యాంసుందర్‌తో పాటు సభ్యుల ప్రమాణస్వీకారం నేడు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.

Updated Date - Nov 04 , 2026 | 11:17 PM