గిరిజన క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:06 PM
గిరిజన సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో మోడల్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ అకా డమిలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాల కోసం జి ల్లాకు చెందిన గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అ భివృద్ధి అధికారి జనార్దన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నారాయణపేట టౌన్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో మోడల్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ అకా డమిలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాల కోసం జి ల్లాకు చెందిన గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అ భివృద్ధి అధికారి జనార్దన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 9 నుంచి 11 ఏళ్లలోపు ఉండాలని, ప్రస్తుతం 4వ తరగతి చదువు తున్న విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఎం పిక ప్రక్రియలో భాగంగా విద్యార్థుల ఎత్తు, బరువుతో పాటు స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, ఫ్లెక్సీబిలిటీ, 800 మీటర్ల పరుగు వం టి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించను న్నట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ఎంపి కైన పదేసి బాలబాలికలను రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 13న మహబూ బ్‌నగర్ జిల్లా క్రీడా ప్రాంగణంలో ఉంటాయ ని, ఆసక్తిగల విద్యార్థులు కుల, ఆదాయ ధ్రు వీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొ టోలు, బోనఫైడ్, ఆధార్‌కార్డు నఖలు ప్రతు లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 12వ తేదీలోపు మహబూబ్‌నగర్ జిల్లా పాలకొం డలోని ఐడీఓసీ కార్యాలయం, రూమ్ నెం. 123లో సమర్పించాలని ఆయన కోరారు.