Share News

ఆలయ అధికారుల్లో గుబులు

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:29 PM

కౌలు భూములలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో శనివా రం వచ్చిన ‘తిలాపాపం తలా పిడి కెడు’.. కథనానికి ఆలయ అధికారుల్లో అలజడి సృష్టిం చింది.

ఆలయ అధికారుల్లో గుబులు
అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సముదాయం

- రైతులను విచారించాలంటున్న భక్తులు

- ఆంధ్రజ్యోతి కథనాలపై ఆరా తీసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌

అలంపూరు చౌరస్తా, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : కౌలు భూములలో జరిగిన అవకతవకల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో శనివా రం వచ్చిన ‘తిలాపాపం తలా పిడి కెడు’.. కథనానికి ఆలయ అధికారుల్లో అలజడి సృష్టిం చింది. ఇన్నాళ్లు ఆలయంలో జరిగే అన్ని వ్యాపార విషయా లు, కౌలుభూముల వ్యవహారం బయటకు పొక్కనిచ్చే వా రు కాదు. కానీ 12 ఏళ్లుగా కౌలు భూముల వేలంలో పేరు కుపోయిన బకాయి వివరాలన్నీ పాఠకులకు అందించడం తో బదిలీపై వెళ్లిన ఈవోల నిర్వహణలో చక్రం తిప్పిన ఉద్యోగులలో గుబులు మొదలైంది. అయితే ఉద్యోగులను విచారిస్తే లాభం లేదని, కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులను విచారణ చేస్తే అవినీతి తిమింగళాలు బయట పడతాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ పర్య టన తర్వాత హైదరాబాదు వచ్చిన డాక్టర్‌ సంపత్‌ కుమా ర్‌ ఆంధ్రజ్యోతి కథనాలపై ఆరాతీసి ప్రభుత్వానికి చెడ్డ పేరుతెస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 01 , 2026 | 11:29 PM