Share News

రాంగ్‌రూట్‌లో వెళ్లి బైకును ఢీకొట్టిన మరో బైకు

ABN , Publish Date - Mar 01 , 2026 | 10:31 PM

జాతీయరహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్లి, ఎదురుగా వచ్చిన మరో బైకును ఢీకొన్నసంఘటనలో బైక్‌పై నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది.

రాంగ్‌రూట్‌లో వెళ్లి బైకును ఢీకొట్టిన మరో బైకు

- తీవ్రంగా గాయపడి మహిళ మృతి

జడ్చర్ల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): జాతీయరహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్లి, ఎదురుగా వచ్చిన మరో బైకును ఢీకొన్నసంఘటనలో బైక్‌పై నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది. ఆదివారం జడ్చర్ల సీఐ కమలాకర్‌ తెలి పిన వివరాల మేరకు... మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మా చారం గ్రామానికి చెందిన మేకల ఎల్లమ్మ(59), జడ్చర్ల సమీపంలోని ఓ హోటల్‌లో కూలీ పనిచేస్తుంది. హోటల్‌ నుంచి ఆమె కుమారుడు మేక ల సాయిపవన్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని, రాంగ్‌రూట్‌లో మాచారం వైపు వెళ్తున్నాడు. హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న మరో బైకును సాయిపవన్‌కుమార్‌ ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో ఎల్ల మ్మ రోడ్డుపై పడి తల కణతిపై తీవ్ర గాయమైంది. వెంటనే సమీపంలో ని వారంతా చికిత్స నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రాం గ్‌రూట్‌లో వెళ్లి, యాక్సిడెంట్‌ చేసిన తన అల్లుడు సాయిపవన్‌కుమార్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఎల్లమ్మ సోదరుడు పిట్టచెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడ్తున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు.

Updated Date - Mar 01 , 2026 | 10:31 PM