సంప్రదాయాలను చాటుతున్న ఆంధ్రజ్యోతి
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:36 PM
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను చాటుతూ ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని మక్తల్ ట్రైనీ ఎస్‌ఐ రేవతి అన్నారు.
మక్తల్ ట్రైనీ ఎస్‌ఐ రేవతి
ముత్యాల ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు
మక్తల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను చాటుతూ ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని మక్తల్ ట్రైనీ ఎస్‌ఐ రేవతి అన్నారు. ఆదివారం మక్తల్ సత్యసాయి మందిరం ఆవరణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై సన్‌ఫీ్‌స్ట మ్యాజిక్ మామ్స్ బిస్కెట్ టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగర్‌బత్తీల పేరిట నిర్వహించిన పోటీలు విజయవంతం అయ్యాయి. రేడియంట్ హైస్కూల్, స్కాలర్స్ జూనియర్ కాలేజీ, అయ్యప్పస్వామి డిగ్రీ కాలేజీల కరస్పాండెంట్ అంజిరెడ్డి స్పాన్సర్ చేశారు. ముగ్గులు వేసేందుకు మహిళలు తరలి వచ్చారు. పోటీపడి అందమైన రంగు రంగుల ముగ్గులను వేశారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎస్‌ఐ రేవతి, స్పాన్సర్ అంజిరెడ్డి మాట్లాడారు. స్వామి వివేకానంద చెప్పిన విధంగా భారతదేశంలోని మహిళలు అందరూ మహిళామణులు అని అన్నారు. వారు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భారతీయ సాంస్కృతిని ‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్’ మీడియా చాటడం అభినందనీయమని అన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. విజేతలు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చి, జిల్లాకు పేరు తేవాలన్నారు. న్యాయ నిర్ణేతలుగా మక్తల్‌కు చెందిన దీప, శ్వేత, గోపాలం వ్యవహరించారు. కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం, ఆంధ్రజ్యోతి జిల్లా ఇన్‌చార్జి శ్రీధర్ రావు, మక్తల్ నియోజకవర్గ ఇన్‌చార్జి డి.సురేందర్, ఫొటో గ్రాఫర్ రవికుమార్, విలేకరులు రవికుమార్‌గౌడ్, జగన్నాథం, లక్ష్మణ్, వీరణ్ణ, కేశవులు, విజయ్‌కుమార్‌చారి, షర్పొద్దీన్, విజయ్, రామలింగం, వెంకటేష్, కురుముర్తి, శివారెడ్డి పాల్గొన్నారు.
విజేతలు వీరే..
ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతిని ఽధన్వాడ మండలం గోటూర్‌కు చెందిన కవిత గెలుచుకున్నారు. ద్వితీయ బహుమతిని నారాయణపేటకు చెందిన బి.విద్య, తృతీయ బహుమతిని మక్తల్ పట్టణానికి చెందిన కొత్త నిరోష కైవసం చేసుకున్నారు. ట్రైనీ ఎస్‌ఐ రేవతి, అంజిరెడ్డి విజేతలకు బహుమతులను అందించారు. ప్రథమ బహుమతిగా రూ.6వేలు, ద్వితీయ బహుమతిగా రూ.4వేలు, తృతీయ బహుమతిగా రూ.3వేలు అందించారు. ప్రోత్స్రహక బహుమతులు మక్తల్‌కు చెందిన అశ్వినికి రూ.వెయ్యి, వృద్ధురాలు శివలింగమ్మకు రూ.500 అంజిరెడ్డి అందించారు. ముగ్గులు వేసిన మహిళలందరికీ మెమొంటోలు అందించారు.