మునిసిపాలిటీలో అవినీతిపై విచారణ జరిపించాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:29 PM
మక్తల్ మునిసిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమా లపై వెంటనే విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
- మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మక్తల్ మునిసిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమా లపై వెంటనే విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధ వారం ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో మాట్లాడుతూ మక్తల్ ము నిసిపాలిటీలోని 16 వార్డుల్లో ఎలాంటి పనులు చేయకుండా ఒక్కో వార్డుకు రూ.లక్ష చొప్పున కేటాయించి పనులు చేయకుండానే బిల్లులు తీ సుకున్నారన్నారు. ఇటీవల 12 మందిని అవుట్ సోర్సింగ్ కింద అధికారుల అనుమతి లేకుండా నియమించుకొని ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్ష లు వసూలు చేసిన చరిత్ర మునిసిపాలిటీ పా లకవర్గానిదే అన్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనుల కోసం టెండర్లు వేసి పనులు చేయకుండా అదే పనులను మునిసిపల్ సిబ్బందితో చేయించడం ఏమిటన్నారు. అవినీతి అక్రమాలు జరుగుతున్న విషయం మంత్రికి తెలియదా? అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదని, కేవ లం అవినీతి మాత్రమే జరుగుతోందన్నారు. మంచినీటి కొరత, పారిశుధ్య లోపం తీవ్రంగా ఉందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, నాయకులు రుద్రసముద్రం రా మలింగం, జుట్ల శంకర్, గాల్‌రెడ్డి, అన్వర్, ఈశ్వ ర్, శివారెడ్డి, జగ్గలి రాములు ఉన్నారు.