Share News

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:17 PM

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందే లా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
ఇళ్ల ప్రొసీడింగ్‌ పత్రాన్ని లబ్ధిదారుకు ఇస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

  • ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాలన్యూటౌన్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందే లా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరై న వారికి ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేశారు. 147 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో గద్వాల పట్టణానికి 515 ఇళ్లు కేటాయించామని అన్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్‌ రామన్‌గౌడ, సీనియ ర్‌ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ జిల్లా రై తు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చెన్నయ్య, మార్కెట్‌యార్డ్‌ వైస్‌చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, ముని సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ బాబర్‌, కమిషనర్‌ జానకీరామ్‌ సాగర్‌ ఉన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:17 PM