Share News

వ్యవసాయ కార్మిక చట్టాన్ని తీసుకురావాలి

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:49 PM

రాష్ట్రంలో వ్యవసాయ కూలీల కోసం సమగ్ర వ్య వసాయ కార్మిక చట్టాన్ని తీసుకురావాలని ఏఐ పీకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ సలీం డి మాండ్‌ చేశారు.

వ్యవసాయ కార్మిక చట్టాన్ని తీసుకురావాలి
బిజ్వార్‌లో నిర్వహించిన సభ్యత్వం నమోదు కార్యక్రమంలో మాట్లాడుతున్న సలీం

- ఏఐపీకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ సలీం

ఊట్కూర్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వ్యవసాయ కూలీల కోసం సమగ్ర వ్య వసాయ కార్మిక చట్టాన్ని తీసుకురావాలని ఏఐ పీకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ సలీం డి మాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని బి జ్వార్‌ గ్రామంలో ఏఐపీకేఎంఎస్‌ సభ్యత్వ నమో దు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కార్మికులకుతో సభ్యత్వం చేయించి వారి కి సంఘం అవశ్యకతను వివరించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ దేశంలో 40 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు పని చేస్తున్నా వీరి బతుకులు దుర్భరంగా ఉన్నాయని అన్నా రు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకా లు లేక, కనీస వేతనాలు అందక చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారని వి వరించారు. వ్యవసాయ రంగంలో కూలీలుగా మహిళా కార్మికులే అధికంగా ఉన్నారని అన్నా రు. నిరుపేదల కూలీలు గ్రామాల్లో ఆకలి తీర్చు కోవడానికే పని చేస్తున్న కూలీ సరిపోతున్నదని అన్నారు. కూలీలందరు సామాజిక దోపిడీకి గు రవుతున్నారు. కూలీల సమూల జీవన మా ర్పుల కోసం ఏఐపీకేఎంఎస్‌ పని చేస్తుందని అ న్నారు. వ్యవసాయ రంగలో స్వదేశీ, విదేశీ కా ర్పొరేట్‌ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా మిగిలిన ప్రభుత్వ, దేవాదాయ, ధర్మాదాయ భూములను భూమిలేని నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కూలీల కనీస వేతనాలను పెంచి కార్మిక చట్టాలను తీసుకురావాలని కోరా రు. కార్యక్రమంలో మల్లేష్‌, తోక ఎల్లప్ప, లొడ్డ తమ్మప్ప, దొబ్బలి కొండప్ప, చెన్నమ్మ, మణె మ్మ, శివ, లక్ష్మణ్‌, కూలీలు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:49 PM