అమెరికా దురహంకారాన్ని ఖండించాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:19 PM
అమెరికా దురహంకారాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లి అన్నారు.
- కేంద్ర ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లి
పాలమూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): అమెరికా దురహంకారాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌లో వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లా డుతూ.. ఇరాన్‌పై ఇజ్రాయిల్-అమెరికా చేస్తున్న దాడిని అందరూ ఖం డించాలన్నారు. పాఠశాలపై దాడిచేసి 150 మంది విద్యార్థులను పొట్ట నపెట్టుకున్న దుర్మార్గులు అమెరికా-ఇజ్రాయిల్ అన్నారు. యుద్ధంతో దే శంలో ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగాయని, 15 రోజుల క్రితం బుక్ చేసిన గ్యాస్ పంపిణీ చేయడం లేదన్నారు. దేశ ప్రధాని యుద్ధంపై వ్య వహరిస్తున్న తీరు సామ్రాజ్యవాద దేశాలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణమే యుద్ధాన్ని ఆపేవిధంగా చర్యలు తీసుకోవా లన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లా డుతూ.. కేంద్రం బడుగు, బలహీన వర్గాలపైన, ముఖ్యంగా ఉపాధ్యా య, వ్యవసాయ కార్మికులపైన పెనుభారాలు మోపేవిధంగ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మ హాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా డా.ఏ.మధు సూదన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా జేపీఎన్‌సీఈ చైర్మన్ రవికుమార్, ప్ర ధాన కార్యదర్శిగా ఆర్.వెంకట్రాములు, కోశాధికారిగా ఏ.రాములు, ఉ మ్మడి జిల్లా వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రముఖులు, రాజకీ య నాయకులు, తదితరులను ఆహ్వాన సంఘంలో ఎంపిక చేశారు. కా ర్యక్రమంలో టీ.సాగర్, జయలక్ష్మి, భూపాల్, పద్మ, కిల్లెగోపాల్, జబ్బార్, వర్ధం పర్వతాలు, పుట్ట ఆంజనేయులు, నల్లవెల్లి కురుమూర్తి, శ్రీనివాసు లు, గోపి, ప్రశాంత్, భరత్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.