పెద్దచెరువులో ఒండ్రుమట్టి తొలగించాలి
ABN , Publish Date - May 10 , 2026 | 11:23 PM
మండల కేంద్రంలోని పెద్దచెరువులో ఒండ్రుమట్టి తొలగి స్తేనే మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశం, నీ టి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుం దని స్థానిక మత్స్య, ముదిరాజ్ సంఘం నాయ కులు పేర్కొన్నారు.
ధన్వాడ, మే 10 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పెద్దచెరువులో ఒండ్రుమట్టి తొలగి స్తేనే మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశం, నీ టి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుం దని స్థానిక మత్స్య, ముదిరాజ్ సంఘం నాయ కులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కోట ప క్క ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో స మావేశమై మాట్లాడారు. రెండేళ్ల క్రితం తీసిన పూడికతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం గణ నీయంగా పెరిగిందన్నారు. ఇందుకు నిదర్శనమే ఈ సారి రెండో పంటను సాగునీటికి ఇబ్బంది లేకుండా పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. మక్తల్ - నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథ కం వచ్చే ఏడాది పూర్తికానుందని అంతలోపే ఇ దొక్కసారి పూడికతీస్తే మత్స్యకార్మికులు, రైతుల కు బహుళ ప్రయోజనాలకు సమకూరుతాయ న్నారు. ముఖ్యంగా ఎక్కడపడితే అక్కడ కాకుం డా ఒక ప్రణాళిక ప్రకారం నీరు సమర్ధవంతం గా నిలిచేలా మట్టిని తీయాలని కోరారు. సమావేశంలో నరహరిముదిరాజ్, నర్సింహులు నాయుడు, నారాయణ, లక్ష్మణ్, వెంకటేశ్, రాం చంద్రయ్య, అచ్చిబాబు, భాస్కర్ పాల్గొన్నారు.