డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:39 PM
ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 252ను సవరించి డెస్క్ జర్నలి స్టుందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (డీజేఏ) డి మాండ్ చేసింది.
- డెస్క్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డిమాండ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 252ను సవరించి డెస్క్ జర్నలి స్టుందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (డీజేఏ) డి మాండ్ చేసింది. గురువారం జిల్లా కేంద్రం లోని ప్రెస్‌క్లబ్‌లో డెస్క్ జర్నలిస్టుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఎడిషన్ సెంటర్లలో నాలుగు అక్రిడిటేషన్ కా ర్డులు ఇస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చే శారు. గత ప్రభుత్వ హయాంలో ఎడిషన్ సెంటర్‌కు ఏడు అక్రిడిటేషన్లు, జిల్లాకు నాలు గు చొప్పున మంజూరు చేశారన్నారు. అదేవి ధంగా ప్రస్తుతం కార్డులు మంజూరు చేయా లని వారు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. పేప ర్ సర్క్యూలేషన్ ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా చిన్న పత్రికల్లో విధులు నిర్వహించే జ ర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టులం దరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు, హెల్త్ కార్డులు మం జూరు చేయాలన్నారు. అనంతరం డెస్క్ జర్నలిస్టుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా విష్ణువర్దన్‌రెడ్డి, కోశాధికారిగా ర వి, ఉపాఽధ్యక్షులుగా చిన్నకుర్మయ్య, తెలుగుప ల్లి వెంకటేశ్, సహాయ కార్యదర్శులుగా భైరం పల్లి వెంకటగిరి, ఏ. విష్ణు, కమిటీ సభ్యులుగా నవీన్‌చారి, ఆర్.నవీన్, పరమేష్, శివకుమార్, జగ దీశ్, రాష్ట్ర కమిటీ సభ్యులుగా జమ్మన్న, శ్రీనివాస్‌యాదవ్ ఎంపికయ్యారు. కార్యక్రమం లో ఎడిషన్ ఇంచార్జులు అలువాల తిరుపత య్య, హరిప్రసాద్, సీనియర్ నాయకులు బత్తిన సాయికుమార్, చక్రవర్తి పాల్గొన్నారు.