అంగన్‌వాడీ కార్యక్రమాలన్నీ అప్‌లోడ్ చేయాలి
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:05 PM
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పంపిణీ చేశారు.
అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు పంపిణీ చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లు మొబైల్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రంలో జరుగుతున్న ప్రతీ విషయంలో యాప్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. ఎంతమంది విద్యార్థులు అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్నారు. వారికి పౌష్టికాహారమైన ఆహారాలు ప్రభుత్వం నుంచి వస్తున్న విషయాలు, గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు సరఫరా చేసే వివరాలను నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సునంద, సీడీపీవోలు కీర్తి, హేమలత, జిల్లా అధ్యక్షురాలు ఇందిరమ్మ, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.