చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:31 PM
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పీహెచ్‌సీ డాక్టర్ మనుప్రియ పంపిణీ చేసి, మాట్లాడారు.
జడ్చర్ల, నవాబ్‌పేట మహబూబ్‌నగర్ రూరల్ జూలై 13 (ఆంధ్రజ్యోతి) : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పీహెచ్‌సీ డాక్టర్ మనుప్రియ పంపిణీ చేసి, మాట్లాడారు. 19ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ వేసుకోవాలని సూచించారు. జడ్చర్ల మునిసిపాలిటీలో 22,900 మంది పిల్లలకు గాను 20,207 మందికి, మండలంలో 14,489 మంది పిల్లలకు 13,873 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నవాబ్‌పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీహెచ్‌సీ డాక్టర్ శ్రావన్‌కుమార్ చిన్నారులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మాపూర్, మణికొండ, గాజులపేట, తెలుగుగూడెం, కోడూర్ పాఠశాలల్లో మణికొండ పీహెచ్‌సీ వైద్యాధికారి శరత్‌బాబు విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు.
పీహెచ్‌సీని పర్యవేక్షించిన డీఎంహెచ్‌వో
మూసాపేట : మండలంలోని జానంపేట పీహెచ్‌సీని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదర్శ గ్రామీణ ఆరోగ్య పరిశోధన విభాగం (సీఎంఆర్) ద్వారా జరుగుతున్న పరిశోధనల గురించి డీఎంహెచ్‌వో డాక్టర్ పున్నం చంద్ర శాస్త్రవేతను అడిగి తెలుసుకున్నారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా సంకలమద్ది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలు వేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి షబానాబేగం, డాక్టర్ రాజు, డాక్టర్ హన్మంతు, సుభాష్, ఎస్‌వో పావని ఉన్నారు.