Share News

పోక్సో కేసులతో బెంబేలు..

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:53 PM

ప్రస్తుత సమాజంలో కామవాంఛను తీర్చుకునేందుకు అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.

పోక్సో కేసులతో బెంబేలు..

గద్వాల క్రైం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సమాజంలో కామవాంఛను తీర్చుకునేందుకు అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తి సొంత కూతురిపైనే లైంగిక వేధింపులకు గురిచేయగా.... మరికొందరు ఒంటరి గా కనిపించే బాలికలను, ఇంటి సమీపంలో ఉన్న వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ టం ఇప్పుడు జిల్లా ప్రజలను బెంబేలెత్తి స్తున్నాయి.

ఆరు నెలల్లో 38 కేసులు

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 38 కేసులు న మోదు కాగా ఈ ఒక్క జూలై నెలలోనే మరో 10 పోక్సో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. అవి కూడా గద్వాల నియోజకవర్గంలోని గద్వాల, ధరూర్‌, గట్టు, మల్దకల్‌, కేటీదొడ్డి మండలాల్లోనే ఎక్కువగా పోక్సో కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.

మచ్చుకకు కొన్ని కేసుల వివరాలు ఇలా...

గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలికపై మూడు రోజుల క్రితం కన్నతండ్రే లైంగిక వేధింపులకు పాల్పడితే ఆ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదేవిధంగా గట్టు మండలానికి చెం దిన ఓ బాలికను గత కొన్ని రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో బాలికను వేధించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఇలా బాలికలపై లైంగిక దాడులకు పాల్పడటం, కేసులు నమోదు చేసి వంచించిన వారిని జైలుకు పంపిస్తున్నా మార్పు రావడం లేదు.

పోలీసులు అవగాహన కల్పిస్తున్నా..

జిల్లాలో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, బాలికలు సమాజంలో ఎలా ఉండాలో తెలిపేందుకు జిల్లా పోలీస్‌శాఖ అవగాహన కల్పిస్తున్నా రు. ఎక్కడైనా లైంగిక వేదింపులు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఈ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్గిఉంటేనే పోక్సో కేసులు తగ్గే అవకాశం ఉంటుంది.

Updated Date - Jul 26 , 2026 | 11:53 PM