Share News

నగర ప్రతిష్టను పెంచేలా అలయ్‌ బలయ్‌

ABN , Publish Date - Oct 25 , 2026 | 10:55 PM

అలయ్‌ బలయ్‌ వంటి కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపోందిస్తాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

 నగర ప్రతిష్టను పెంచేలా   అలయ్‌ బలయ్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- అలరంచిన కార్యక్రమం

- పాల్గొన్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అలయ్‌ బలయ్‌ వంటి కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపోందిస్తాయని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఆదివారం నగరంలోని గడియారం చౌరస్తా వద్ద అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ప్రజలందరూ కలిసికట్టుగా, పరస్పర గౌరవంతో మెలుగుతూ మహబూబ్‌నగర్‌ నగర ప్రతిష్టను మరింత పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయ్యప్ప దీక్షలు చేపట్టి మండల కాలం పాటు భగవంతున్ని ఆరాదిస్తూ, ప్రజలను ఆధ్యాత్మిక వైపు నడిపించే దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌ గౌడ్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ కేసీ నర్సిములు, కార్పొరేటర్లు రఘుయాదవ్‌, ప్రశాంత్‌, పాతూరి రమేష్‌బాబు, అనుప ఆంజనేయులు, కిషన్‌ నాయక్‌, నవకాంత్‌, కుర్వ సత్యం, పాండురంగారెడ్డి, రమేష్‌, మర్రిజ్యోతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజుదేశ్‌పాండే, రాష్ట్ర అధ్యక్షుడు సీమ నరేందర్‌, నాయకులు నరేందర్‌ గుప్తా, భానుప్రకాష్‌, ఆరేళ్ల రమేష్‌, మంత రవి, శంకర్‌, శ్రీను, నర్సింహారావు, యాదయ్యగౌడ్‌, బాలప్రసాద్‌, గోవర్దన్‌ గౌడ్‌, సతీష్‌ కుమార్‌, రమేష్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 10:55 PM