అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఐలమ్మ
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:29 PM
అణగారిన వర్గాల హక్కుల కోసం వీరనారి ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఖుష్బూగుప్తా పేర్కొన్నారు.
- కలెక్టర్ ఖుష్బూగుప్తా
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : అణగారిన వర్గాల హక్కుల కోసం వీరనారి ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, మాట్లాడారు. ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ హరిప్రియ, అసిస్టెంట్ సాయిశివాని, డీఆర్వో నిర్మల, కలెక్టరేట్ ఏవో సువర్ణరాజ్ పాల్గొన్నారు.
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి యువత ఆదర్శం అని పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం పీయూలో ఏర్పాటు చేసిస కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అరిపంచి, మాట్లాడారు. పేద రైతుల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పీయూ రిజిస్ట్రార్ పి.రమేష్‌బాబు, అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రకాంత్, ప్రవీణ్, కుమారస్వామి, కృష్ణయ్య, సంధ్యారాణి, ప్రిన్సిపాల్ భూమయ్య పాల్గొన్నారు.