ఎయిడ్స్ నివారణ అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:05 PM
ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
గద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తు న్న ఆరోగ్య వారోత్సవాల్లో గురువారం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ అ వగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎయిడ్స్ అనేది హెచ్‌ఐవీ వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధి అని, ఇది శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఏఆర్‌టీ చికిత్స తీసుకుంటే వైరస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుందన్నారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఎంహెచ్‌వో సంధ్యాకిరణ్మయి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, ప్రోగ్రాం అధికారి రాజు, ఇతర వైద్యాధికారులు, డాక్టర్లు ఉన్నారు.