Share News

త్వరలో ఏఐ ఆధారిత విద్య

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:56 PM

త్వరలోనే ఏఐ ఆధారిత విద్యను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.

త్వరలో ఏఐ ఆధారిత విద్య

- ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

కొత్తకోట, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : త్వరలోనే ఏఐ ఆధారిత విద్యను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో నూతనంగా నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాలను ఆయన సోమవారం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతరెడ్డితో కలిసి సందర్శించారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తకోటలో దాతల సహకారంతో రూ.1.77 కోట్లతో పాఠశాల భవనం, పీఎంశ్రీ పథకం నిధులు రూ.33.50 లక్షలతో లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌ నిర్మాణం చేసుకు న్నామని తెలిపారు. ఈ పాఠశాల భవనాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖ ల అధికారులు సమ న్వయంతో పని చేయాలని ఆదేశించారు. పాఠశాల భవనం ప్రారం భం అనంతరం విద్యార్థులతో సంభాషణ కార్యక్రమంలో ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌, సీడీసీ చైర్మన్‌లు ప్రశాంత్‌, చంద్రమోహన్‌రెడ్డి మునిసిపల్‌ కమిషనరు సైదయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ పల్లవి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 05:11 PM