బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:26 PM
పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన కు టుంబాలను ఆదుకోవాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు సత్యయాద వ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్
- పార్టీ నాయకుల నిరాహార దీక్ష విరమణ
మద్దూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన కు టుంబాలను ఆదుకోవాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు సత్యయాద వ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. విస్తరణ బాధితులను ఆదుకోవాలని డి మాండ్ చేస్తు ఆ పార్టీ నాయకులు చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను మంగళవారం ఆయన సందర్శించి వారికి పండ్ల రసం తాగించి దీక్షను విరమింపజేయించారు. అనంతరం మాట్లాడు తూ ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించి, ఆదుకోవాలని కోరారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించా రు. పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.