Share News

సెమీస్‌కు చేరిక

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:25 PM

ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయస్థాయి అండ ర్‌-17 బాలుర క్రికెట్‌ టోర్నీ రసవత్తరంగా కొనసాగుతున్నది. తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, డీఏవీ జట్లు సెమీస్‌కు చేరాయి.

 సెమీస్‌కు చేరిక
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సంజయ్‌

- తలపడనున్న తమిళనాడు, డీఏవీసీఎంసీ, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ జట్లు

- రసవత్తరంగా నేషనల్‌ అండర్‌-17 క్రికెట్‌ టోర్నీ

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, ఏప్రిల్‌ 30 (ఆం ధ్రజ్యోతి): ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయస్థాయి అండ ర్‌-17 బాలుర క్రికెట్‌ టోర్నీ రసవత్తరంగా కొనసాగుతున్నది. తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, డీఏవీ జట్లు సెమీస్‌కు చేరాయి. మంగ ళవారం జిల్లా కేంద్రంలో రెండు, జడ్చర్ల మినీ స్టేడియంలో క్వార్టర్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వ హించారు. జడ్చర్ల మినీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు-కేరళ జట్టు తలబడ్డా యి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జట్టులో తమిళ్‌ అర్ధసెంచరీ(64)తో రాణించాడు. కేరళ బౌలర్లలో జెవిన్‌, ఇషాన్‌ చేరో వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ దిగిన కేరళ జట్టు 18.1 ఓవర్లలో 133 పరుగులకు అలౌట్‌ అయ్యింది. కేరళ జట్టులో ఇషాన్‌ 40 పరుగులు చేసి రా ణించాడు. తమిళనాడు బౌలర్లలో విబిష్‌, మా వసీం చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజ యానికి కృషి చేశారు. 36 పరుగుల తేడా తమిళనాడు గెలిచి సెమీస్‌ చేరింది. మరో మ్యాచ్‌లో డీఏవీసీఎంసీ జట్టు జమ్మూకశ్మీర్‌పై 10 పరుగుల తేడా గెలిచి సెమీస్‌ చేరింది. టాస్‌ గెలిచి మొదట బ్యా టింగ్‌ చేసిన డీఏవీ సీఎం సీ జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లనష్టానికి 142 పరుగులు చేసింది. జ ట్టులో స్వస్తిక్‌ 57 పరుగులు చేసి రాణిం చా డు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమ్మూ కశ్మీర్‌ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఓటమిపాలైంది. లూబైజ్‌ 62 పరుగులు చేశాడు. డీఎవీ సీఎంఎసీ జ ట్టులో దర్శ్‌ 2, వంశన్‌ 2 వికెట్లు తీసి జట్టు విజయానికి కృషి చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఆర్‌ మైదానంలో ఉ త్తరప్రదేశ్‌-ఉత్తరఖాండ్‌ జట్లు తలబడ్డాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఉత్తర ప్రదేశ్‌ జట్టు 19.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టాని కి 108 పరుగులు చేసింది. జట్టులో హర్షయా దవ్‌ 26 పరుగులు సాధించాడు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో నీరజ్‌ 2, కృనాల్‌ 2 వికెట్లు సాధిం చారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరా ఖండ్‌ జట్టు 17.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టాని కి 112 పరుగులు చేసి 4 వికెట్ల తేడా తేడా గెలిచి సెమీస్‌కు చేరింది. జట్టులో ధృవ్‌ 42, కృష్ణ 44 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేశారు. నగరంలోని ఎండీసీఏ మైదానం లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు రాజస్తాన్‌పై 47 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌ చేరింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 భారీ స్కోర్‌ చేసింది. జట్టులో హర్షిల్‌ అ ర్ధసెంచరీ(54), రాహుల్‌ 35 పరుగులు చేసి రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో రోణిత్‌ 2 వి కెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ జట్టు 18.4 ఓవర్లలో 153 పరుగు లు చేసి ఓటమిపాలైంది. జట్టులో కృష్‌ 36, హేమంత్‌ 34, అయూష్‌ 39 పరుగుల చేశా రు. ఢిల్లీ బౌలర్లలో ఆర్యావీర్‌ 2, ఆకాష్‌ 2, అష్మిత్‌ 2 వికెట్లు తీసి రాణించారు.

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమాని, క్రీడాస్ఫూర్తిని చాటాలని టోర్నీ జాతీయ పరిశీ లకుడు సంజయ్‌ అన్నారు. శుక్రవారంసెమీస్‌ లో ఉత్తరాఖండ్‌-డీఎవీ సీఎంసీ, ఢిల్లీ-తమిళ నాడు జట్లు తలబడుతాయి. ఫైనల్‌ మ్యాచ్‌ జడ్చర్ల మినీ స్టేడియం జరుగుతుంది. ఎస్‌జీ ఎఫ్‌ సెక్రటరీ శారదబాయి, మొయిన్‌, పీడీ నిరంజన్‌ తదతరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 11:25 PM