Share News

వసతి గృహాల్లో తగిన వసతులు

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:22 PM

జిల్లా కేంద్రంలోని బాలుర గిరిజన సం క్షేమ వసతి గృహంలో విద్యార్థు లకు ఆరోగ్యకరమైన వాతావర ణం కల్పించేలా ప్రతీ రోజు శుభ్ర తా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు.

వసతి గృహాల్లో తగిన వసతులు
వనపర్తిలో గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి విద్యా విభాగం, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని బాలుర గిరిజన సం క్షేమ వసతి గృహంలో విద్యార్థు లకు ఆరోగ్యకరమైన వాతావర ణం కల్పించేలా ప్రతీ రోజు శుభ్ర తా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధ వారం కలెక్టర్‌ రాంనగర్‌ కాలనీ లోని కళాశాల విద్యార్థుల గిరిజన సంక్షేమ హా స్టల్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సంద ర్భంగా వంట, స్టోర్‌ రూమ్‌లను పరిశీలించి ఆ హార పదార్థాల నిల్వ తనిఖీ చేశారు. హాస్టల్‌ ప రిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకో వడంతో పాటు నీటి సమస్య లేకుండా చూడా లని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలె క్టర్‌ ముఖాముఖి అయ్యారు. హాస్టల్‌లో అందు తున్న వసతులు, భోజన నాణ్యత, తాగునీరు, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకు న్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మధు, అధికారులు పాల్గొన్నారు.

రహదారులపై ఆక్రమణలు ఉండొద్దు

వనపర్తి రాజీవ్‌ చౌరస్తా: జిల్లాలోని జాతీయ రహదారులపై ఎలాంటి ఆక్రమణలు, అనధికార పార్కింగ్‌కు అవకాశం లేకుండా అధికారులు చ ర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదే శించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మం దిరంలో సుప్రీంకోర్టు జారీ చేసిన రహదారి భ ద్రతా మార్గదర్శకాల అమలుపై జిల్లా రోడ్డు భద్రతా కమిటీ, జాతీయ రహదారి టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు ఎస్పీ సునీతరెడ్డి, అదనపు కలెక్టర్‌ ఖీ మ్యానాయక్‌, అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు నుంచి పెబ్బేరు మండలం రంగాపూర్‌ వరకు జాతీయ రహదారి పరిధిలో ఉన్న ఆక్ర మణలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకో వాలన్నారు. రోడ్డు భద్రతను మెగురుపరిచేం దుకు నిరంతర నిఘా, పెట్రోలింగ్‌ నిర్వహించా లన్నారు. జాతీయ రహదారుల పీడీ బన్సల్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ పరిమళ, డీటీవో సురేష్‌కు మార్‌, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌కు సహకరించాలి

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పా ర్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ ఆద ర్శ్‌ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఎస్‌ఐఆర్‌ పురోగతిపై క లెక్టర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావే శం నిర్వహించారు. జిల్లాలో డిజిటలైజేషన్‌ 77.49శాతం పూర్తయ్యిందని తెలిపారు.

Updated Date - Jul 22 , 2026 | 11:22 PM