Share News

ఉద్యమకారులను ఆదుకోవాలి

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:47 PM

రాష్ట్ర సా ధనలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారు లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అలంపూర్‌ తాలుకా తెలంగాణ ఉద్యమకారుల సం ఘం నాయకులు కోరారు.

ఉద్యమకారులను ఆదుకోవాలి

  • ఏఐసీసీ కార్యదర్శికి నాయకుల వినతి

వడ్డేపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సా ధనలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారు లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అలంపూర్‌ తాలుకా తెలంగాణ ఉద్యమకారుల సం ఘం నాయకులు కోరారు. ఈమేరకు ఆదివారం శాంతినగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ క్యాంప్‌ కార్యాల యంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సం పత్‌కుమార్‌ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడు తూ అలంపూర్‌ తాలుకాలో ఉన్నటువంటి ఉద్య మకారులందరికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హా మీలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కు మార్‌ మాట్లాడుతూ ఉద్యమకారులందరికీ తా ను అండగా ఉంటానన్నారు. సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లి, ఉద్యమ సమయంలో పనిచేసిన ప్రతీ ఉద్యమకారుడికి ప్రభుత్వం నుంచి ప్రతీ పథకం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గార్ల పాడు భూషణం, ఉపాధ్యక్షుడు దగ్గుపాటిబాబు, ప్రధాన కార్యదర్శి దేవేంద్ర, వడ్డేపల్లి మండల అధ్యక్షుడు రేపల్లె సూరిబాబు, సీనియర్‌ నాయకుడు లాజర్‌ ఉన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 11:47 PM