Share News

వైద్యసేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:42 PM

రోగులకు అందించే సేవల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జోగుళాంబ గద్వాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అజ్గర్‌అలీ హెచ్చరించారు.

వైద్యసేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు
గట్టు పీహెచ్‌సీలో సిబ్బందితో మాట్లాడుతున్న డాక్టర్‌ అజ్గర్‌అలీ

  • డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అజ్గర్‌అలీ

గట్టు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రోగులకు అందించే సేవల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జోగుళాంబ గద్వాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అజ్గర్‌అలీ హెచ్చరించారు. మంగళవారం గట్టు ప్రాథమిక ఆరోగ్యంకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, సి బ్బంది హాజరు, మందుల నిల్వలు, వినియోగం, వివిధ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మెరుగైన వైద్యసేవలు అందించాలని చెప్పారు. జాతీయ ఆరోగ్య, ప్రజారోగ్య కార్యక్రమా లు, మాతా-శిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌, టీబీ, లెప్రసీ సేవలను లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చే యాలని సూచించారు. వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నవీకరించి, పెండింగ్‌లో ఉన్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని సూచించారు.

Updated Date - Sep 29 , 2026 | 11:42 PM