Share News

సమయపాలన పాటించకుంటే చర్యలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:41 PM

సమయపాలన పాటించకుంటే కఠినమైన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సమయపాలన పాటించకుంటే చర్యలు
హాజరు రిజిష్టర్‌ను తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్‌

భూత్పూర్‌ పీహెచ్‌సీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

భూత్పూర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సమయపాలన పాటించకుంటే కఠినమైన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10:30 గంటలు కావస్తున్నా వైద్యాధికారి, వైద్య సిబ్బంది ఎందుకు ఆస్పత్రికి రాలేదని మండిపడ్డారు. ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదన్నారు. రోగులకు సేవలు సక్రమంగా అందించాలంటే వైద్యాధికారులు, సిబ్బంది సమయానికి ఆస్పత్రికి హాజరు కావాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెడికల్‌ స్టోర్‌లోని మందులను పరిశీలించారు. కాలం చెల్లిన మందులను ని ర్వీర్యం చేయాలని చెప్పారు. పా ముకాటు, కుక్కకాటు మందులు అందుబాటు ఉంచాలని సూచించారు. అనంతరం రోగులతో మాట్లాడారు. వైద్యులు సక్రమంగా సేవలు అందిస్తున్నారా? అని అడిగారు. ఆయన వెంట తహసీల్దార్‌ కిషన్‌నాయక్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:41 PM